శివాజీ పవరస్త్రని దొంగిలించిన అమర్ దీప్.. మాములుగా ఉండదంటూ ఫైర్!
on Sep 20, 2023
బిగ్ బాస్ హౌజ్ లో పదహారవ రోజు శివాజీ ఫైర్ అయ్యాడు. హీటెక్కించే మాటలతో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు సాగాయి. బిగ్ బాస్ సీజన్-7 ఉల్టా పల్టాతో యమ క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇప్పటికే ఈ షో అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తుంది.
వినాయకచవితి సందర్భంగా హౌజ్ లోని కంటెస్టెంట్స్ సంప్రదాయబద్ధంగా రెడీ అయి పిండితో వినాయకుడిని చేశారు. సింగర్ దామిణి అందరి కోసం సేమియా చేసింది. కాసేపటికి ఒక్కో కంటెస్టెంట్స్ మధ్య ఇంట్రస్టింగ్ టాపిక్స్ నడిచాయి. ముందుగా రతిక ఒంటరిగా కూర్చొని తన మాజీ లవర్ గురించి బాధపడుతుంటే శివాజీ వెళ్ళి ఓదారుస్తాడు. నీ గేమ్ నువ్వు ఆడు. నీ పర్సనల్ విషయాలు ఎవరికీ చెప్పొద్దు, ఎవరికి అవకాశం ఇవ్వొద్దంటూ ఓదార్చాడు. మరొకవైపు ఆట సందీప్, టేస్టీ తేజ కలిసి నామినేషన్ల గురించి మాట్లాడుకున్నారు. అందరు శుభశ్రీ, యావర్ , ప్రియాంక జైన్ ని నామినేట్ చేసి పల్లవి ప్రశాంత్ ని వదిలేసారేంటని టేస్టీ తేజ అనగా.. కావాలని వదిలేసారని ఆట సందీప్ చెప్పాడు. అసలు నాకు నామినేషన్ వేసే అవకాశం ఇస్తే పల్లవి ప్రశాంత్ ని కచ్చితంగా నామినేట్ చేసేవాడిని అని ఆట సందీప్ అన్నాడు. మరొకవైపు రతిక, పల్లవి ప్రశాంత్ ల మధ్య చిల్లర గొడవ జరిగింది. వాళ్ళిద్దరి మధ్య గొడవని శుభశ్రీ ఆపే ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు ఆపలేదు. శివాజీ ఆపాలని ప్రయత్నిస్తుండగా అతడి పవరస్త్రని అమర్ దీప్ దొంగిలించి ఒకచోట దాచిపెట్టాడు.
కాసేపటికి తన పవరస్త్రని ఎవరో దొంగిలించారని తెలుసుకున్న శివాజీ గార్డెన్ ఏరియాలో కూర్చొని ఫీల్ అయ్యాడు. నా పవరస్త్రని ఎవరు తీశారో వాళ్లకి మాములుగా ఉండదు తొక్క తీస్తా అంటూ శివాజీ అన్నాడు. అయితే శివాజీ పక్కన అమర్ దీప్, రతిక ఉన్నారు. అమ్మ నాన్న ఇదే నేర్పించారా అంటూ తన పవరస్త్రని దొంగిలించిన వారిపై శివాజీ ఫైర్ అయ్యాడు. మరొకవైపు మూడవ హౌజ్ మేట్ కోసం యావర్, అమర్ దీప్, శోభా శెట్టిలని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఎంపిక చేస్తాడు. అయితే హౌజ్ లో తను లేనని బిగ్ బాస్ అనుకున్నాడా? నేను ఓడిపోయాను అంటూ పల్లవి ప్రశాంత్ ఒంటరిగా కూర్చొని ఏడ్చేసాడు. కాసేపటికి బిగ్ బాస్ ప్రశాంత్ ని పిలిచి ఆ ముగ్గురు ఎందుకు అనర్హులని భావిస్తున్నారో చెప్పమని చెప్పాడు. అయితే శోభా శెట్టి కంటే తను బెటర్ అని పల్లవి ప్రశాంత్ చెప్తాడు. ఇక హౌజ్ లో ఒక్కో కంటెస్టెంట్ ని సీక్రెట్ రూమ్ కి పిలిచి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటాడు బిగ్ బాస్. అయితే అమర్ దీప్ అనర్హుడని కొందరు, మరికొందరు యావర్ అనర్హుడని చెప్తారు. ఆయితే కాసేపటికి సీక్రెట్ రూమ్ లో యావర్ హౌజ్ మేట్ గా అనర్హుడని ఎవరెవరు చెప్పారో బిగ్ స్క్రీన్ మీద చూపించాడు బిగ్ బాస్. దాంతో యావర్ చాలా ఎమోషనల్ అవుతాడు. 'తేజ చేశాడంటే ఐ ఆక్సెప్ట్, కానీ నువ్వు నన్ను అనర్హుడని చెప్పావ్ చూడు. అది బాధేస్తుంది' అంటూ యావర్ ఎమోషనల్ అయ్యాడు. ఇక తర్వాతి ఎపిసోడ్‌లో యావర్, రతికల మధ్య లవ్ ట్రాక్ మొదలైందన్నట్టుగా రేపటి ప్రోమోలో చూపించాడు బిగ్ బాస్.